విశాఖపట్నం, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, తిరుపతి, బెంగళూరు కంటోన్‌మెంట్‌ల మధ్య ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ కె త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిలో ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే వారానికోసారి ప్రత్యేక రైళ్ల పొడిగింపును నడపాలని నిర్ణయించిందని వెళ్లడించారు.
ఈ మెరకు రైలు నం. 08579 విశాఖపట్నం
సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ రైలు మార్చి 1నుండి ఏప్రిల్ 26 వరకు బుధవారాల్లో 19. 00 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు 08. 20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. తిరుగు దిశలో రైలు నెం. 08580 సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు గురువారం మార్చి 2నుండి ఎప్రిల్ 27 వరకు 19. 40 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు 6. 40 గంటలకు విశాఖపట్నంచేరుకుంటుందని తెలిపారు.
రైలు నెం. 08585 విశాఖపట్నం- మహబూబ్‌నగర్ వీక్లీ స్పెషల్ రైలు మార్చి 7నుండి ఎప్రిల్ 25 వరకు మంగళవారాల్లో 17. 35 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు 10. ౩౦ గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుందని తిరుగు దిశలో రైలు నం. 08586 మహబూబ్‌నగర్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు మార్చి 8నుండి ఎప్రిల్ 26 వరకు బుధవారాల్లో 18. 20 గంటలకు మహబూబ్‌నగర్ నుండి బయలుదేరి మరుసటి రోజు 09. 50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందన్నారు.
రైలు నెం. 08583 విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు సోమవారం మార్చి6నుండి ఎప్రిల్ 24 వరకు 19. 00 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు 09. 15 గంటలకు తిరుపతి చేరుకుంటుందని తిరుగు దిశలో రైలు నెం. 08584 తిరుపతి-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ మంగళవారం మార్చి 7నుండి మార్చి25వరకు 21. 55 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు 10. 15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు.
రైలు నెం. 08543 విశాఖపట్నం-బెంగుళూరు కాంట్ వీక్లీ స్పెషల్ రైలు ఆదివారం మార్చి 5నుండి ఎప్రిల్ ౩౦వరకు 15. 55 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు 09. 15 గంటలకు బెంగళూరు కాంట్ చేరుకుంటుందని తిరుగు దిశలో రైలు నెం. 08544 బెంగుళూరు కాంట్ - విశాఖపట్నం వీక్లీ స్పెషల్ బెంగుళూరు కాంట్ నుండి మార్చి 6 నుండి మే 1 వరకు సోమవారాల్లో 15. 50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 11. 00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని అన్నారు.
రైలు నెం. 02809 భువనేశ్వర్-తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు శనివారాల్లో మార్చి4 నుండి ఎప్రిల్ 29 వరకు 13. ౩౦ గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటి రోజు 07. 50 గంటలకు తిరుపతి చేరుకుంటుందని తిరుగు దిశలో రైలు నెం. 02810 తిరుపతి-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ మార్చి 5నుండి ఎప్రిల్ ౩౦వరకు ఆదివారాల్లో 20. 00 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు 16. 30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుందని అన్నారు.