ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 13వ తేదీన జరగనున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం 11:30 కు కడపలో పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నాయకుడు మరియు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ప్రతి కార్యకర్త ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కడప నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్ బాబు, లక్ష్మీరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.