కర్ణాటకలోని ఐఏఎస్..ఐపీఎస్ అధికారుల సాగిన ఫేస్ బుక్ వార్ పై పెద్ద చర్చాసగిన విషయం తెలిసిందే. ఈ సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య జరుగుతోన్న పోరు అనేక మలుపులు తిరుగుతోంది. సోషల్ మీడియా, మీడియా ముందు ఎటువంటి ప్రకటనలు చేయొద్దని ప్రభుత్వం హెచ్చరించినా.. ఐపీఎస్ రూపా మౌడ్గిల్ మాత్రం వెనక్కితగ్గలేదు. ఐఏఎస్ రోహిణి సింధూరిని టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం, సామాజిక కార్యకర్త గంగరాజుతో ఆమె మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో లీక్ కలకలం రేగింది. ఈ నేపథ్యంలో రోహిణికి ఊరటనిచ్చేలా బెంగళూరు సిటీ సివిల్ కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీచేసింది.
రోహిణికి సింధూరికి వ్యతిరేకంగా ఎటువంటి తప్పుడు, పరువునష్టం కలిగించే ప్రకటనలు చేయొద్దని రూపా మౌడ్గిల్, దాదాపు 60 మీడియా సంస్థలకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. తన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సివిల్ సర్వీసెస్ నియమ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కోర్టులో రోహిణి దావా వేశారు. దీనిపై విచారించిన సివిల్ కోర్టు.. ఇంతకుముందు కేవియట్ దాఖలు చేసిన మీడియా సంస్థల్లో ఒకదానికి సమన్లు జారీ చేసి ఆంక్షలు విధించింది. అలాగే, మీడియా సంస్థ, రూపా తమ అభ్యంతరాలను మార్చి 7లోపు దాఖలు చేయాలని ఆదేశించింది. మిగిలిన మీడియా సంస్థలు తమ అభ్యంతరాలను దాఖలు చేయడానికి మార్చి 17 వరకు సమయం ఇచ్చింది.
‘‘వాది, ప్రతివాది ఇద్దరూ ప్రధానంగా ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిని కలిగి ఉన్న ఉద్యోగులు అని కూడా గమనించాలి.. వారి ప్రవర్తనను నియంత్రించే సర్వీస్ నిబంధనలు అణగదొక్కలేరు.. దురదృష్టవశాత్తు ప్రభుత్వ అధికారుల ప్రవర్తన నియమావళిని సివిల్ కోర్టు అధికార పరిధిని ప్రేరేపించింది. ఈ దశలో ప్రతివాదికి జారీచేసిన నోటీసులు ప్రవర్తనా నియమావళి కిందకు రావు’’ అని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
‘కాబట్టి అత్యవసర నోటీసులు జారీ చేస్తున్నాం.. అదే సమయంలో ఈ దావా విషయానికి సంబంధించి ఏదైనా ప్రకటనలు లేదా అభిప్రాయాలు, తప్పుడు కథనాలు ప్రసారం చేయకుండా వాది తనను తాను నిగ్రహించుకోవాలని స్పష్టం చేస్తున్నాం.. ప్రతివాది నెం.3 కేవియట్ దాఖలు చేయాలి’ అని కోర్టు పేర్కొంది.
రూపా ఆరోపణలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రోహిణి.. ఆమెపై పరువునష్టం దావా వేశారు. ఏకంగా కోటి రూపాయలను చెల్లించడంతో పాటు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఐఏఎస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa