సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆయన సతీమణి కల్పనాదాస్‌తో కలిసి శ్రీశైలం లోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం సుప్రభాత సేవ, మహా మంగళహారతి సేవల్లో సీజేఐ దంపతులు పాల్గొన్నారు. శనివారం రాత్రి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఆదిమూలపు సురేశ్, సీఎస్ జవహర్ రెడ్డి, ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి ప్రత్యేక పూజలు చేయించి ఆలయ విశిష్టతలను వివరించారు. సీజేఐ రాకను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
జస్టిస్ చంద్రచూడ్ దంపతులు సుమారు గంటపాటు శ్రీశైలం మల్లన్న ఆలయంలో గడిపారు. గత రాత్రి (శనివారం) భ్రమరాంబ అతిథిగృహం వద్ద అధికారులు పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువాలతో ఆయనను సత్కరించారు.ఆలయ అర్చకులు ఆయనకు తిలకధారణ చేసి పూలమాలలతో స్వాగతం పలికారు. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ, ఆయన సతీమణి సత్యప్రభ కూడా మల్లన్న సేవలో పాల్గొన్నారు.