ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వమే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి.. ఓటర్లను ప్రలోభపెట్టడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బెదిరింపులకు పూనుకుంటోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఈవోకు శనివారం లేఖ రాశారు.