మాతృసంస్థ శ్రీ సరస్వతీ విద్యా పీఠం స్వర్ణోత్సవాల సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక పాఠశాల అభివృద్ధికి హితోదికముగా సహకరించిన దాతలకు, విధ్యాభిమానులకు సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ భావాలు గల యువతీ, యువకుల నిర్మాణమే లక్ష్యంగా పనిచేసే పాఠశాల, మన గ్రామములో వుండటం సంతోషమని, సరస్వతీ విద్యా మందిరం పాఠశాల అవసరం ఈనాటి సమాజానికి ఎంతో అవసరమని, ఈ పాఠశాల అభివృద్ధికి చేయూత నిచ్చి నిలుపుకోవడం మన బాధ్యత అన్నారు. ఉన్నత విలువలు కలిగిన యువత నిర్మాణమేశ్రీ సరస్వతీ విద్యాపీఠం లక్ష్యమని, చదువు స్వార్థం కోసం కాదు, సమాజం కోసము ఉపయోగపడాలని ప్రధానాచార్యులు కరణం తిరుమల రావు అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి పాణ్యం రంగనాథ శర్మ , పాఠశాల కార్యదర్శి రామమోహన్ గుప్త ప్రారంభం నుండిఇప్పటి వరకు విద్యాపీఠం, పాఠశాల సాధించిన ప్రగతి వివరించారు. 30 మంది పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను కమిటీసభ్యులు సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు నాగభూషణం, హరికిషోర్, మయూర, ఆచార్య బృందం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa