ఇరాన్ లో దారుణం చోటుచేసుకుంది. బాలికలను చదువుకు దూరం చేసేందుకు వందలాదిమంది విద్యార్థినులపై విషప్రయోగం చేశారు. యాత్రా స్థలమైన కామ్ నగరంలో బాలికలు స్కూల్ కు వెళ్లకుండా ఉండేందుకు వారిపై విషప్రయోగం చేస్తున్నారు. 'దీనివల్ల ఇప్పటికే వందల మంది శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. బాలికల స్కూళ్లు మూతపడాలని ఈ పని చేశారు' అని ఆ దేశ డిప్యూటీ మినిస్టర్ యానస్ పనాహీ వెల్లడించారు.