గత టీడీపీ హాయాంలోనే అటు రాష్ట్రంలో ఇటు గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని సయ్యద్ షాన్షావలి అన్నారు. ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం పట్టణంలోని 4వ వార్డులో ఆదివారం రాత్రి నిర్వహించారు. టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కృషితో పట్టణంలోని ప్రతివీధిలో సిమెంటు రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించుకున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించినట్లు పేర్కొన్నారు. వచ్చే వైసీపీ ప్రభుత్వం రకరకాల సాకులు చెప్పి సంక్షేమ పథకాల నుంచి అర్హులను తొలగించడమే పనిగా పెట్టుకొందని ఆరోపించారు.