కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని సీఐటీయూ కృష్ణా జిల్లా, ఉపాధ్యక్షుడు వై నరసింహారావు పిలుపునిచ్చారు. స్థానిక కార్మిక భవన్‌లో ఆదివారం నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గస్థాయి సీఐటీయూ వ్యవసాయ కార్మిక సం ఘం, కౌలురైతు, రైతు సంఘాల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిందని, పబ్లిరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తూ ప్రైవేట్, కార్పొరేట్ రంగాలకు ధారాదత్తం చేసేందుకు పూనుకుందని ఆరోపించారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారావు, నాయకులు జాన్‌మోజేస్, శివశంకర్, యు. త్రిమూ ర్తులు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బి.రాజేశ్, నరేశ్ పాల్గొన్నారు.