క్రిస్టియన్ సమాజం, సంఘాల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ తరఫున క్రైస్తవ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. బిష్పలు, రెవరెండ్లు ఇతర క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను సీఎంకు నివేదించారు.