వందే భారత్ రైలు విడి భాగాల తయారీ ప్రాజెక్టును చేపడతున్న మేధా సర్వే డ్రైవ్స్ సంస్థ త్వరలో విశాఖపట్నంలో మరో విడత జాబ్ మేళా నిర్వహించనుందని రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ సి.నాగరాణి తెలిపారు. కొత్తగా చేపడుతున్న వందే భారత్ రైలు ప్రాజెక్టుకు పాలిటెక్నిక్ విద్యార్థుల అవసరం ఉన్నందున విశాఖలో మరో విడత జాబ్‌మేళా నిర్వహించాలని సాంకేతిక విద్యాశాఖ చేసిన ప్రతిపాదనపై మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని ఆమె వివరించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక హోటల్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన జాబ్‌మేళా ముగింపు కార్యక్రమంలో నాగరాణి మాట్లాడారు. ఈ జాబ్‌మేళాలో 48 మంది సర్వీస్ ఇంజినీర్ ట్రైనీలుగా, 29 మంది విద్యార్థులు అప్రెంటి్‌సలుగా.. మొత్తం 77 మంది ఎంపికయ్యారని చెప్పారు.