అన్ని రంగాల్లో రాణించాలంటే విద్యార్థులు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టరు విజయరామరాజు అన్నారు. వేంపల్లి పట్టణంలో స్థానిక కందుల ఓబులరెడ్డి చారిటబుల్ పారిశ్రామిక శిక్షణా సంస్థను మంగళవారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడు తూ విద్యార్థులు నైపుణ్యత సాధించినప్పుడే వారి జీవితా లకు సార్థకత లభిస్తుందన్నారు. విద్యార్థుల శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంత్రాలను ఆయన పరిశీలించారు. అలాగే విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక విద్య ద్వారా ఉపాధి పొందాలని ఆయన విద్యార్థులకు సూచించారు. సాంకేతికవిద్యనభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగవకాశాలు కూడా మెండుగా ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఓఎస్టీ అనిల్ కుమార్ రెడ్డి , తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఐటిఐ ప్రిన్సిపల్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.