ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతిలోకి వచ్చాక వాటి నిర్వాహణ అంశం చర్చాంశనీయంగా మారింది. ఇదిలావుంటే ఇటీవలి కాలంలో పలుమార్లు సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ మరోసారి మొరాయించింది. ఇండియా, బ్రిటన్, జపాన్, అమెరికా సహా అనేక దేశాల్లో యూజర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. యూజర్లకు పేజీలు లోడ్ కాలేదు. ఎర్రర్ మెసేజ్ కనిపించింది. కాసేపటి తర్వాత మళ్లీ సరిగా పని చేయడం ప్రారంభించింది. మరోవైపు ట్విట్టర్ కు ఏమైందంటూ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. తరచుగా సమస్యలు తలెత్తుతుండటంపై విమర్శలు కురిపిస్తున్నారు.