తులసిని ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు. తులసి అనేక ఆరోగ్య సమస్య నుంచి రక్షణ ఇస్తుంది. తులసి వల్ల పాంక్రియాటిక్ బీటా కణాల పనితీరు, ఇన్సులిన్ స్రవించే విధానం మెరుగుపడుతుందని అధ్యయనాల్లో తేలింది. తులసి ఆకుల్లో హైపోగ్లైసిమిక్ లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి తులసి గొప్ప ఔషధంలా పనిచేస్తుందని జర్నల్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. షుగర్ పేషెంట్స్ తులసి రసం తాగితే.. మంచిది