మోదీ ప్రభుత్వపాలన నిర్లక్ష్యంపై ఏప్రిల్ 5న ఇంటింటా ప్రచారంతో పాటు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు చెప్పారు. బుధవారం పార్వతీపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలు, జీవోలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఉపాధి హామీ కార్యక్రమాన్ని పట్టణాల్లో కూడా అమలు చేసి 200 రోజుల పనిని కల్పించాలన్నారు. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చాలన్నారు.కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, కార్యదర్శి బీవీ రమణ, కోశాధికారి జీవీ రమణ పాల్గొన్నారు.