కోడుమూరు విశాలాంధ్ర పత్రిక పాత్రికేయుడు సతీష్ పై దానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ పంపియాలని, దాడులకు పాల్పడిన వ్యక్తులపై కఠిన శిక్షలు పడేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని శుక్రవారం ఆస్పరి పాత్రికేయులు తహసీల్దార్ కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు. పాత్రికేయునిపై దాడికి పాల్పడిన అధికార పార్టీ నాయకులు బలరాంను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.