చెవుల్లోంచి గులిమిని మళ్లీ మళ్లీ శుభ్రం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చెవుల్లోకి దుమ్ము, బ్యాక్టీరియా, వైరస్ వెళ్లకుండా గులిమి రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. ఇయర్ బడ్స్ అతిగా వాడకూడదని, ఇవి ఎక్కువగా వాడితే చెవిలో తీవ్ర నొప్పి, రక్త స్రావం జరగొచ్చని అంటున్నారు. అలాగే వినే సామర్థ్యం కూడా తగ్గొచ్చని పేర్కొంటున్నారు. చెవిలో గులిమి ఎక్కువని భావిస్తే వైద్యున్ని సంప్రదించాలంటున్నారు.