తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం ఎండలు, రాత్రి తీవ్ర చలి నమోదవుతుంది. తెలంగాణలో పొడి గాలుల ప్రభావంతో ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడుతుంది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని అధికారులు తెలిపారు. రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే 2 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.