వేసవికాలంలో మాంసం తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో మాంసాహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో పైల్స్, పిస్టులా, ముక్కు నుంచి రక్తం కారడం తదితర సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల మాంసాహారాన్ని తగ్గించడంతో పాటుగా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.