స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కొందరు దాన్ని వదులుకోలేరు. అలాంటి వారు ఈ ఆహారం తీసుకుంటే స్మోకింగ్ మానేసే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాలు, పండ్లు, కూరగాయలు స్మోకింగ్ ప్రభావాన్ని తగ్గిస్తాయంటున్నారు. దాల్చిన చెక్కను నమిలితే స్మోకింగ్ ఈజీగా మానేయవచ్చు. పాప్ కార్న్, ఫాక్స్ నట్స్ రోజూ ఓ కప్పు తినడం వల్ల స్మోకింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.