ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండగా ఉక్కపోతలు మొదలయ్యాయి. ఫిబ్రవరిలోనే 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతకు చేరువైంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా చేరనున్నాయని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంటోంది. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రం కానున్నాయని హెచ్చరిస్తోంది. ఈ ఏడాది వడగాలుల ప్రభావం కూడా అధికంగానే ఉంటుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.