ఉదయాన్నే వాము టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లలో వాము వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు సగమయ్యాక వడపోసి కొద్దిగా తేనె కలుపుకొని తాగాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయని, గ్యాస్, మలబద్దకం, కడుపు నొప్పి వంటి రుగ్మతలు తొలగుతాయంటున్నారు. కీళ్ల నొప్పులు తగ్గుతాయని, రోగ నిరోధక శక్తి పెరిగి నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు దూరం చేస్తుందని పేర్కొంటున్నారు.