నరసరావుపేట: చెల్లని చెక్కు కేసులో ఆర్టీసీ డ్రైవర్ కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె. అంజయ్య శుక్రవారం తీర్పు చెప్పారు. ఇస్లాంపేటకు చెందిన షేక్ పెద్ద సైదా వద్ద చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న పసుమర్తి ఖాలేషావలి 2016 సంవత్సరంలో రూ. 2. 50 లక్షలు అప్పుగా తీసుకుని చెల్లింపులో భాగంగా చెక్కు ను అందజేశాడు. ఖాతాలో నగదు లేకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 6 నెలలు జైలు శిక్షతో పాటు ఫిర్యాదు దారుడికి రూ. 5లక్షల రూపాయల పరిహారం అందజేయాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.