నియోజకవర్గంలోని ప్రతి సచివాలయానికీ అత్యవసర సమస్యల పరిష్కారం కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ. 20 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్ 1, 2 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తవడంతో సదరు సచివాలయాలకు రూ. 20 లక్షలు చొప్పున రూ. 40 లక్షలు మంజూరయ్యాయన్నారు. గడపగడప నిధులు మంజూరు పత్రాలను శుక్రవారం సదరు గ్రామస్తులకు ఎమ్మెల్యే శ్రీదేవి మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ రూ. 40 లక్షల నిధులతో సదరు సచివాలయ పరిధిలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సంక్షేమ పథకాలను అందించడంతో పాటు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.