ఎర్రగొండపాలెం నడిబొడ్డున రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశాలు, కృషితో వైఎస్సార్ ప్రయాణికులు ప్రాంగణం 2021లో ప్రారంభించారు. ప్రారంభం రోజు జరిగిన సభలో కోటి రూపాయలు నిధులతో ఆర్టీసీ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే రెండేళ్లు కావొస్తున్న ఇంత వరకు ఎటువంటి అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. ఈ ఆర్టీసీ ప్రాంగణం నుండి హైదరాబాద్, విజయవాడ, శ్రీశైలం, ఒంగోలు ఇలా అన్ని ప్రాంతాలకు బస్సులు తిరుగుతుంటాయి. ప్రయాణికులు వెళుతుంటారు. అంత ప్రాధాన్యం ఉన్న ఈ బస్టాండ్ లో వసతులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. రోడ్లపై ఎదురుచూపులు. సుమారు 1. 5 ఎకరంలో వైఎస్సార్ ఆర్టీసీ ప్రాంగణం ఉన్నప్పటికీ వసతులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఇప్పటికి రోడ్లపై ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ వేసి చూస్తున్నట్లు ప్రయాణికులు చోబుతున్నారు. మంత్రి హామీ ఇచ్చిన అభివృద్ధి చేయకపోవడంతో వట్టి హామీలేనా అభివృద్ధి చేయరా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన మంత్రి సురేష్ స్పందించి నిధులు మంజూరు చేసి వైఎస్సార్ ఆర్టీసీ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజల కోరుతున్నారు.