ప్రకృతి వ్యవసాయాన్నిఉద్యమముగా ముందుకు తీసుకుని వెళ్లాలని మాస్టర్ ట్రైనర్ కిరణ్ పిలుపునిచ్చారు. రాజాం మండలంలోని పొగిరి గ్రామంలో సోమవారం విత్తన గుళికలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురవక పంటలు ఎండిపోతాయని తెలిపారు. దానికి ప్రధానమైన కారణం వర్షాలు సకాలంలో కొరవకపోవడం వలన ప్రతి రైతు విత్తనాలను గుళికలుగా తయారు చేస్తున్నారని చెప్పారు. వీటిని పొడి వాతావరణంలో చల్లుకోవడం వల్ల తేమ శాతంతో సూక్ష్మ వాతావరణం వృద్ధి చెందుతుందన్నారు. నీటి అవసరం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో విత్తన గుళికలు నేలలో వేయటం వలన రైతులకు ఎంతో ఉపయోగపడు తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.