అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కోట జంక్షన్ వద్దగల విజయ బ్లడ్ బ్యాంక్ లో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆవనాపు భావన డీసీఎంఎస్ చైర్ పర్సన్ మాట్లాడుతూ విజయనగరం యూత్ ఫౌండేషన్ వారు మహిళలను ఒక్కచోట చేర్చి సన్మానించడం శుభ పరిణామం అని , ఈరోజు మహిళలు ఎన్నో ఉన్నత పదవులు సాధిస్తున్నారని, ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తూ, ఒంటరిగా విదేశాలకు కూడా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని, స్త్రీ ఎక్కడైతే నివసిస్తుందో అక్కడే దేవతలు వుంటారు అని ఒక స్త్రీ చదువుకుంటే గనుక తన పిల్లలకే కాకుండా మరెంతో మందికి చదువు చెప్పగలుగుతుంది అని అన్నారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో తమ చాతుర్యాన్ని చాటుతున్నారన్నారు. భవిష్యత్‌లో అన్నిరంగాల్లో మరింత ముందుకు దూసుకెళ్లాలనిపిలుపునిచ్చారు , డాక్టర్ నవ్య ఎండి అంకాలజీ మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు , ఉద్యోగం చేసే మహిళలు అటు ఇంటి పనులు ఇటు ఆఫీస్ పనులలో పడి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్యoగా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సన్మాన గ్రహీతలు పోలీస్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్, రెవిన్యూ డిపార్ట్మెంట్, యువ లాయర్లు, ఎన్జీవో సంస్థలు వారికి ఈ సన్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు. షేక్. ఇల్తమాష్, సభ్యులు అశోక్, సాయి, రాయల్ క్యాబ్స్ శరత్, రాము, విజయ్, వంశీ మహేష్, భాను, విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ శివ పాల్గొన్నారు.