అచ్యుతాపురం మండలం తంతడి-వాడపాలెం తీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. కొన ఊపిరితో ఉన్న దీనిని గ్రామానికి చెందిన మత్స్యకార యువకులు సముద్రంలోకి పంపించడానికి ఎంతగా ప్రయత్నించినా వీలుకాలేదు. ఎనిమిది అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు ఉన్న ఈ డాల్ఫిన్ 200 కేజీల వరకు బరువు ఉంటుందని మత్స్యకార యువకులు తెలిపారు. రసాయన కంపెనీల వ్యర్థాలు శుద్ధి చేయకుండా నేరుగా సముద్రంలోకి విడిచిపెట్టడంతో మత్స్యసంపదతో పాటు అరుదైన జాతికి చెందిన తాబేళ్లు, తిమింగలాలు, డాల్ఫిన్లు ఎక్కువగా చనిపోతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తిక్కవానిపాలెం, పూడిమడక పరిధిలో రసాయన కంపెనీల వ్యర్థాలను సముద్రంలోకి కలిపే పైపులైన్లు వల్లే ఇలా జరుగుతోందని ఆరోపించారు