హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి బుధవారం 300 మందిదాకా రోగులు వచ్చి ఎమర్జెన్సివార్డులో డ్యూటీలో ఉన్న వైద్యునివద్దే పరీక్షలు చేయించుకున్నారని వైద్యులు తెలిపారు. అయితే బుధవారం సెలవుదినం కావడంతో ఓపీ లేదు. అయనా 300 మంది రావడంతో వారికి పరీక్షలు చేసి మందులిచ్చి పంపారు. ఒకవేళ ఓపీ ఉండిఉంటే 600 నుంచి 700 దాకా రోగులు వచ్చేవారని వైద్యులు తెలిపారు. గత పది రోజులుగా ఆసుపత్రికి వచ్చేవారిలో దగ్గు, జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నవారే అధికమని వైద ద్యులు తెలిపారు.