భామిని. నేరాల నియంత్రణపై ప్రతి పోలీసూ దృష్టి సారించి నేరచరిత్ర లేకుండా చూడాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎస్. హరికృష్ణ పేర్కొన్నారు. బుధవారం బత్తిలి పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో పోలీసులు పర్యటిస్తుండాలని, వారి దృష్టికి వచ్చిన సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ప్రజలు, పోలీసులకు మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉంటే గ్రామాల్లో ఎలాంటి సంఘటనలకు తావులేకుండా ఉంటుందన్నారు. దీనిపై గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టి పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలని కోరారు.