పాలకొండ తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణకు సంబంధించి ఎట్టకేలకు కాంక్రీటు లైనింగ్ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. వాస్తవానికి గత ఏడాది డిసెంబరు నుంచి పనులు పూర్తిస్థాయిలో జరగాల్సి ఉంది. గత నవంబరులో అధికారులు కాలువల ద్వారా నీటిని నిలిపివేసినా. లైనింగ్ పనులను చేసేందుకు రెండు నెలల సమయం పట్టింది. కుడి, ఎడమ కాలువలకు సంబంధించి 57 కి. మీ. కాంక్రీటు లైనింగ్ పనులు జరగాల్సి ఉండగా, ఇప్పటికే కుడి, ఎడమ కాలువల పరిధిలో 19 కి. మీ. మేరకే పూర్తయ్యాయి.