కర్నూలు జిల్లా, దేవనకొండ, మండల పరిధిలోని పీ కొటకొండ గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. క్రిష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన సూర్యప్రకాష్ (26)కు దేవనకొండ మండలం పీ కోటకొండ గ్రామానికి చెందిన మైత్రితో ఏడాది క్రితం వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. పీ కోటకొండలో సుంకలమ్మ అవ్వ దేవర జరుగుతుండడంతో బుధవారం సూర్యప్రకాష్ గ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే గ్రామంలో వారి ఇంటి ముందే హత్యకు గురయ్యాడు. గుండెలపై పిడిబాకుతో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవతోపాటు, బంధువులతో ఉన్న విభేదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ విషయంపై ఎస్‌ఐ భూపాల్‌ను వివరణ కోరగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.