కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలంలోని ఎం.తండా గ్రామానికి చెందిన శేఖర్ నాయక్ పెళ్లి అయిన 9 రోజులకే మరో యువతితో పరారయ్యాడు. ఇతను 52-బసాపురం గ్రామ సచివాలయ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 23న ఎం. తండాకు చెందిన శేఖర్ నాయక్‌కు సమీప బంధువుతో వివాహమైంది. అయితే.. పెళ్లయిన మూడు రోజులకే తనకు భార్య వద్దంటూ, గ్రామానికే చెందిన మరో యువతిని ప్రేమించానని, ఆమెతోనే కాపురం చేస్తానని సర్వేయర్ చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ప్రేమిస్తున్న యువతి ఇది తెలుసుకొని తాను కూడా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ నెల 5న శేఖర్ నాయక్ తన ప్రియురాలితో కలిసి పరారయ్యాడు. భార్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు ప్రారంభించారు. కర్నూలులో ఉన్న సర్వేయర్ శేఖర్ నాయక్‌ను, యువతిని మాధవరం పోలీ్‌సస్టేషన్‌కు తీసుకువచ్చి పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. మంత్రాలయం సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ కిరణ్‌బాబు ఇరువురి తల్లిదండ్రులకు, సర్వేయర్‌కు, యువతికి, నవ వధువుకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆ యువతిని కర్నూలు ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ హోంకు తరలించారు. శేఖర్ నాయక్‌కు, నూతన వధువుకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.