ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రెస్టారెంట్ లోని... ప్రాంక్ వీడియోలతో వెలుగులోకి దారుణాలు

international |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2023, 12:15 AM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీని వల్ల ఉపయోగం ఎంత ఉందో.. దుర్వినియోగం అంతేస్థాయిలో ఉంటోంది. ప్రాంక్ పేరుతో కొందరు చేసే వికృత చేష్టలు జగుప్సాకరంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో జపాన్‌లో సోషల్‌ మీడియా ట్రెండ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తతున్నాయి. కన్వేయర్‌ బెల్ట్‌ సహాయంతో ఆహారం అందించే సుషీ రెస్టారంట్లలో ఆహార పదార్థాలను ముట్టుకోవడం, ఎంగిలి చేయడం వంటి చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీంతో అటువంటి చర్యలకు పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.


జపాన్‌లో ఆహారం విషయంలో ఎంతో శుభ్రత పాటిస్తారు. అక్కడి రెస్టారంట్లలో వెయిటర్లతో పని లేకుండానే కన్వేయర్‌ బెల్ట్‌ సహాయంతో కస్టమర్లకు ఆహారం అందించడాన్నే ‘సుషీ’ అని పిలుస్తారు. కస్టమర్లకు అవసరమైన ఆహారం, ప్లేట్లు, ఇతర పాత్రలు నేరుగా కిచెన్‌ నుంచే ఓ బెల్టుపై తిరుక్కుంటూ వచ్చి చేరుతాయి. జపాన్‌లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ విధానం అక్కడ 1950ల్లోనే మొదలయ్యింది. అనంతరం ఇది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది.


అయితే, ఈ సుషీ రెస్టారంట్లలో ఇటీవల కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సోయా సాస్‌లలో ఉమ్మి వేయడం, కస్టమర్ల కోసం బెల్టు మీద వెళ్లే ఆహారాన్ని తినడం, ఎంగిలి చేతులతో ముట్టుకోవడం, ఇతరుల పాత్రల్లోని వీళ్లు తీసుకోవడం వంటి చర్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోన్న కస్టమర్లు.. సుషీ రెస్టారంట్లలో ఇంత దారుణం జరుగుతోందా? అని షాకవుతున్నారు. అదే సమయంలో ఇతరుల ఆహారాన్ని అపరిశుభ్రం చేయడంపై మండిపడుతున్నారు. వీటిని ‘సుషీ టెర్రర్‌’గా పేర్కొంటూ ఆన్‌లైన్‌ ఉద్యమం చేపట్టారు.


ప్రముఖ రెస్టారంట్లలో సుషీ టెర్రర్‌కు పాల్పడిన ప్రాంక్‌లు సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడంతో కస్టమర్లు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. దీని కారణంగా ఏకంగా ఓ ప్రముఖ సంస్థ షేర్లు నష్టపోయాంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతోన్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. సుషీ వ్యవహారంలో జపాన్‌లో ఇటువంటి అరెస్టులు జరగడం ఇదే మొదటిసారి. మరోవైపు, ఈ తరహా ఘటనలపై జపాన్‌ రెస్టారంట్ల యాజమాన్యాలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి సుషీ విధానంపైనే తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతాయని.. తాజా అరెస్టులు యువతలో మార్పు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.


ఈ చేష్టలు కురా సుషీలోని ఉద్యోగులను అత్యవసర శుభ్రపరచడానికి బలవంతం చేశాయి.. సాధారణ వ్యాపార కార్యకలాపాలను కష్టతరం చేస్తుంది అని పోలీస్ అధికారి ప్రతినిధి తెలిపారు. దీనిపై ఇంకా ఎటువంటి అభియోగాలు నమోదు చేయనప్పటికీ వ్యాపారాన్ని బలవంతంగా అడ్డుకోవడం జపాన్ చట్టం ప్రకారం కఠినమైన మూడు సంవత్సరాల జైలు శిక్ష సహా జరిమానాలు విధిస్తారు. యువకుల అరెస్ట్‌ను కురా సుషీ స్వాగతించింది. జపాన్ వ్యాప్తంగా ఈ సంస్థకు దాదాపు 500 మేర బ్రాంచ్‌లు ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com