ధాన్యం విక్రయించి, నెలలు గడిచినా సొమ్ము చెల్లించకపోవటంతో ఆగ్రహించిన కృష్ణా జిల్లా, పెదపారుపూడి, యలమర్రు గ్రామ రైతులు రైతు భరోసా కేంద్రానికి తాళాలు వేసి శుక్రవారం నిరసన తెలిపారు. విక్రయించిన ధాన్యాన్ని అధికారులు ఆన్‌లైన్ చేయకపోవటం, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సైటును ఆపేయడంతో ఆర్బీకేలు నిరుపయోగంగా మారాయని దళారుల వ్యవస్థ కన్నా దారుణంగా తయారయ్యాయని ఆరోపించారు. ఆర్బీకేలకు తాళాలు వేయటంతో అధికారులు, పోలీసులు వచ్చి రైతులతో చర్చించారు. త్వరలోనే ధాన్యం నగదు రైతుల ఖాతాల్లో పడేట్లు ఉన్నతాధికారులకు నివేదిస్తామని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.