వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల కుమారుడు తన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబును గద్దె దింపాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని తాను అనలేదని.. ఇలాంటి వ్యాఖ్యలను ఎడిట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఇది మహిళా దినోత్సవం రోజు వారి ఛానల్లో కూడా ప్రసారం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ విషయంపై తమ నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నేత చెప్పారు.