ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పదంగా యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2023, 03:27 PM

అతనో గ్రామ వలం టీర్‌. అతనికి పెళ్లి కుదిరింది. ఆదివారం వివాహం. ఇంతలోనే శుక్రవారం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో దెందులూరు మండలం కొవ్వలిలో విషాదం నెలకొంది. కొవ్వలి కొమ్మనోరి తోటపేటకు చెందిన మన్నే నాగరాజు కుమారుడు రాము(27) గ్రామ వలంటీరుగా పనిచేస్తున్నాడు. అతనికి తాడేపల్లిగూడెంకు చెందిన మహిళతో ఆదివారం రాత్రి పెళ్లి జరగనుంది. దీంతో పెళ్లి బట్టలు, సామగ్రి తెచ్చేందుకు కుటుంబ సభ్యు లంతా ఏలూరు వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి రాము ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు ‘నీకు ఏం కష్టమొచ్చిందని ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డావురా ?’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లి ఇష్టం లేక చేసుకున్నాడా ? లేక మరేదైనా కారణం ఉందా ? అనే విషయాలపై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఏలూరుకు తరలించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com