బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థల్ని బీజేపీ ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాలను కూలగొట్టెందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుతుందన్నారు. అన్ని శక్తులను ఐక్యం చేసేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు దేశంలో ఉండకూడదని బీజేపీ భావిస్తోందన్నారు. దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కల మాదిరిగా ప్రతిపక్షాల పైకి వదిలిందని విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థల వేధింపులకు బీఆర్‌ఎస్ భయపడదని స్పష్టం చేశారు. కవిత పై ఈడీ కేసులు కక్ష పూరిత చర్యే అని ఆయన అన్నారు.