జీడిపప్పు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోజూ జీడిపప్పును తింటే నేత్ర సంబంధ సమస్యలు తగ్గుతాయి. జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ పెంచడానికి, మెదడు పనితీరు సక్రమంగా జరగడానికి జీడిపప్పు పనిచేస్తుంది. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండెజబ్బు ప్రమాదం నుంచి కూడా రక్షిస్తుంది.