5 నిమిషాల్లో తయారయ్యే ఇన్ స్టెంట్ నూడిల్స్ చాలామంది అధికంగా లాగించేస్తుంటారు. దీనిలోని సోడియం పోషకమే అయినా అధిక మొత్తంలో తింటే సమస్యలేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల దీర్ఘకాలిక తలనొప్పి, వికారం, అధిక రక్తపోటు, బలహీనత, కండరాలు బిగుతు, ఛాతినొప్పి, గుండె దడ వంటి రుగ్మతలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల వీటిని తినడం తగ్గించాలంటున్నారు.