‘బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని, భారతదేశానికి వెన్నుముక లాంటి వాళ్లని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావడంలేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని పవన్ ప్రశ్నించారు.