ఫౌల్ పాక్స్ అనేది కోళ్లలోను, ఇతర పక్షుల్లో వచ్చే ఒక అంటువ్యాధి. చర్మం పైన బొబ్బలు ఏర్పడటం, గుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల, కోళ్లు చనిపోవడం జరుగుతుంటుంది. కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి బి కాంప్లెక్స్ మందులను ఇవ్వాలి. యాంటీబయోటిక్ పౌడర్ నీళ్లలో కలిపి ఐదు నుంచి ఏడు రోజులు తాగించాలి. చర్మం పైన ఏర్పడిన బొబ్బలను పొవిడిన్ అయోడిన్ యాంటీసెప్టిక్ ద్రావణంతో శుభ్రం చేయాలి. వ్యాధి బారిన పడిన కోళ్లను మంద నుంచి వేరు చేయాలి.