పక్షుల కారణంగా ‘బర్డ్ బ్రీడర్ లంగ్ డిసీజ్’ అనే శ్వాసకోశ సమస్యకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఇలాంటి కేసులు భారీగా పెరుగుతున్నాయి. కోళ్లు, పక్షుల విసర్జిత పదార్ధాల దుమ్ము వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తోందని చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, జ్వరం, ఛాతి బిగుతుగా అనిపించడం, అలసట వంటి లక్షణాలుంటాయని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.