ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, కర్ణాటక, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. స్వామి వారికి దర్శనానికి సుమారు ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.