వ్యక్తిగత కారణాల వల్ల గత కొన్ని నెలలుగా అందుబాటులో లేకపోవడం జరిగిందని దర్శి ఎమ్మెల్యేదర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పార్టీ ఆఫీస్ లో శనివారం రాత్రి జరిగిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రస్తుతం వ్యక్తిగత కార్యక్రమాలు పూర్తి కావడం తో ఇకపై పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని పత్రికలు, చానల్లో తాను పార్టీ మారబోతున్నట్టు వచ్చిన వార్తలు కల్పిత ప్రచారాలని అన్నారు. ఎన్నికల దగ్గర పడుతుండడంతో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. సీఎం జగన్ చెప్పినట్టు ఆయన అడుగుజాడల్లో నడుస్తానని, ఆయనకు తనపైన నమ్మకం, తనకు ఆయనపై నమ్మకం ఉందని తెలిపారు.