ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సేవలందిస్తున్న,,,బక్కచిక్కిన ఎనుగు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2023, 06:33 PM

ఎనుగు అంటేనే భారీ ఆకారం చూసివుంటాం. కానీ బక్కచిక్కిన ఎనుగును  చూసివుండం.. వాటి గురించి వినివుండం.  తాజాగా థాయ్‌లాండ్‌కు చెందిన పై లిన్ అనే ఆడ ఏనుగు (71) 25 ఏళ్లుగా పర్యాటక శాఖలో సేవలు అందించింది. ట్రెక్కింగ్‌ విభాగంలో పనిచేసిన ఈ ఏనుగు.. దశాబ్దాలుగా పర్యాటకులను మోయడంతో నిర్వికారంగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ ఏనుగుపై ఆరుగుర్ని ఒకేసారి ఎక్కించి తిప్పేవారు. పర్యాటకులను మోసి మోసి బక్కచిక్కిపోయిన ఈ ఏనుగు ఫొటోను వైల్డ్‌లైఫ్‌ ఫ్రెండ్స్‌ ఫౌండేషన్‌ ఇన్‌ థాయ్‌లాండ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేస్తూ ఏనుగుల దయనీయ పరిస్థితిని వివరించింది.


‘‘భారీ కాయంతో కన్పించే ఏనుగులు ఎంతటి బరువునైనా మోయగలవు అనుకుంటే పొరబాటే.. వాటి వెన్నెముక.. అధిక బరువులను మోసేందుకు అనువుగా ఉండదు. అలాంటిది వాటిపై నిరంతరం పర్యాటకులకు ఎక్కించడం వల్ల వాటి శరీరానికి శాశ్వత నష్టం వాటిల్లుతుంది. దయచేసి ఎప్పుడూ ఏనుగు అంబారీ ఎక్కొద్దు. ఈ సందేశాన్ని అందరికీ చేర్చండి’’ అన రాసుకొచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసే ఈ సంస్థ ఇలాంటి ఎన్నో మూగజీవాలను కాపాడి తమ సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చింది. అందులో పై లిన్‌ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ ఏనుగు తమ కేంద్రంలో స్వేచ్ఛగా విహరిస్తోందని వెల్లడించింది.


‘ఈ ఫోటోను చూస్తే పై లిన్ వెన్నెముకను ఎలా వంగిపోయిందో తెలుస్తుంది.. సహజంగా వెన్నుముక గుండ్రంగా, పైకిలేపి ఉంటుంది... ఏళ్ల తరబడి బరువులు ఎక్కించుకోవడం వల్ల భారీ బరువుతో వంగిపోయింది..వాటి (ఏనుగుల) శరీరాలపై ఈ నిరంతర ఒత్తిడి కణజాలం, ఎముకలను క్షీణింపజేస్తుంది. వెనుకభాగంలో వెన్నెముకకు కోలుకోలేని భౌతిక నష్టం కలిగిస్తుంది’ అని తెలిపింది. అలాగే, ఇలాంటి మరో ఏనుగు బూన్ చ్యుయే ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ ఏనుగు కూడా దశాబ్దాల పాటు బరువులు మోసి వెన్నుముక జారిపోయింది అని పేర్కొంది.


ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బక్కచిక్కిపోయిన ఏనుగుల ఫోటోలు చూసి చాలా మంది హృదయాలు చలించిపోతున్నాయి. ఇలాంటి కీలక విషయాన్ని అందరికీ తెలిసేలా చేసినందుకు పలువురు నెటిజన్లు వఫ్ట్ సంస్థకు కృతజ్ఞతలు చెబుతున్నారు. మూగజీవుల పట్ల ఇలాంటి క్రూరత్వాన్ని వెంటనే ఆపాలని.. టూరిస్టు రైడ్లపై నిషేధం విధించాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మన వినోదం కోసం జంతువులను హింసించే హక్కు లేదు.. ఏనుగులు ఏనుగులు తమ కుటుంబాలతో స్వేచ్ఛగా ఉండే హక్కు ఉన్న సామాజిక అడవి జంతువులు.. ఇది చాలా భయానకం.. నా హృదయం ద్రవిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com