సీమ చింతకాయల్లో క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, విటమిన్ సిలు మెండుగా ఉన్నాయి. సీమ చింత గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు బాగా ఉపయోగపడుతుంది. సీమ చింతకాయల్లో ఉండే విటమిన్ సీ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ల బారిన పడకుండా రక్షిస్తుంది. ఇక గర్భిణులకు సీమ చింత మంచి పోషకాలను ఇస్తుంది. నీరసం తగ్గిస్తుంది. ఈ కాయల్లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.