ఆయాసంతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ రెండు చిటికల పసుపు, చిటికెడు మెత్తటి ఉప్పు తీసుకోవాలి. వేడి టీలో 9 చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి తాగాలి. లేత ముల్లంగి, వెలగపండు, తేనె, వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆయాసం ఎక్కువగా ఉంటే 100 గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూటగట్టాలి. దానిని వీపుపై, గొంతుపై ఇరువైపులా కాపడం పెట్టాలి. ఇలా చేస్తే కఫం కరిగి బయటకు వస్తుంది. శ్వాస కుదుట పడుతుంది.