బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తున్న యాత్రికుల ఆటోను మాధేపురా వద్ద ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద దాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. అయితే ఈ ఘటనలో ఆగ్రహించిన స్థానికులు చౌసా-ఉదకిషుంగంజ్ రాష్ట్ర రహదారిని దిగ్బంధించి నిరసన చేపట్టారు. పోలీసులు వారికి సర్దిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa