ఈ జూలైలో విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతున్నామని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులైలో విశాఖకు తరలివెళుతున్నామని చెప్పారు. విశాఖ నుంచే పాలన ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖ అని ఢిల్లీలోనూ, ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ జగన్ ప్రకటించారు. ఇటు అసెంబ్లీ సమావేశాల్లోనూ విశాఖ గురించి మరోసారి ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
ఇదే సమయంలో.. కొందరు మంత్రులకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైసీపీనే గెలవాలని స్పష్టం చేశారు. మంత్రుల పని తీరును గమనిస్తున్నాను.. ఏ మాత్రం తేడా వచ్చిన ఊరుకోను.. అని జగన్ అన్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మనవాళ్లను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ.. మంత్రులను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. ఇందులో తేడా వస్తే.. మార్పు తప్పదని స్పష్టం చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే.. జగన్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా జరుగుతోంది.